
దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య ఒక మంచి బంధం ఏర్పడినట్లు అనిపించింది. ‘అరవింద సమేత’ విడుదలకు కొద్ధి రోజుల ముందు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయారు. ఆ టైంలో ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్టేజ్ పై చెప్పారు ఎన్టీఆర్. అలాగే, ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత తనతో సినిమా చేసిన ఎన్టీఆర్ అంటే అంతే ఆప్యాయతని కనబర్చారు త్రివిక్రమ్. అందుకే… త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో సినిమా (#ఎన్టీఆర్30) ప్రకటన వచ్చింది.
తీరా షూటింగ్ కి వెళ్లాల్సిన టైంలో ఈ సినిమా అటకెక్కింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య పొరపచ్చాలు వచ్చాయనేది ఇప్పటివరకు బయటికి వినిపిస్తున్న టాక్. ఇపుడిప్పుడే అసలు విషయం ఇదంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇగోనే అసలు సమస్య. మిగతావన్నీ సెకండరీ.
ఇప్పుడు చెయ్యకపోయినా తర్వాత అయినా వీరి కాంబినేషన్లో మూవీ ఉంటుందా? కష్టమే. నిజంగా వారిద్దరి మధ్య అంతగా చెడిందట.