మహేష్ వల్ల ఎన్టీఆర్ పై ఒత్తిడి

NTR and Mahesh


సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ నిర్వహించిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి అతిథిగా విచ్చేశారు. వీరి ఇద్దరి మధ్య ఆసక్తికరంగా సాగింది సంభాషణ. మహేష్ తరుచుగా విదేశాలకు వెళ్తుంటారు. ఏడాదికి రెండు మూడు సార్లు వెకేషన్ కి వెళ్లడం గురించి ఎన్టీఆర్ ప్రశ్నిస్తే, దానికి మహేష్ బాబు ఇచ్చిన సమాధానం కూడా బాగుంది.

“పిల్లలను ఇప్పుడే తిప్పాలి. అన్ని చూపించాలి. వారి జ్ఞానం, ఆలోచనాపరిధి పెరుగుతుంది. పైగా వాళ్ళు ఇప్పుడే మనతో ఎక్కువగా ఉంటారు. కొంచెం పెరిగాక వారి సర్కిల్, వారి స్నేహితులతోనే గడుపుతారు,” అని మహేష్ బాబు చెప్పారు.

మహేష్ అన్న మీ వల్ల మా ఇంట్లో కూడా ప్రెజర్ పెరిగింది అని ఎన్టీఆర్ నుంచి కౌంటర్ వచ్చింది. ఎన్టీఆర్ భార్యాపిల్లలు కూడా వెకేషన్ కి తీసుకెళ్లామని కోరుతున్నారట. దాంతో ఎన్టీఆర్ కూడా మహేష్ బాటలోనే వెళ్తున్నారు. ఇటీవలే పారిస్ యాత్ర చేసి వచ్చింది ఎన్టీఆర్ కుటుంబం.

మహేష్ బాబు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా ఒక మల్టీస్టారర్ వస్తుందా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories