నా నిర్ణయాల వెనుకున్నది వాళ్లే!

‘మత్తు వదలరా’తో హీరోగా అడుగుపెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా రూపొందిన రెండో మూవీ…"తెల్లవారితే గురువారం“. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుద‌ల కానుంది.

ఆదివారం (మార్చి 21న) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

“నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు రావడం లేదు. రేపొద్దున భార్గవ్, అభయ్‌ ల సక్సెస్ ను చూసి కూడా ఇంతే సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక వాళ్లు ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కాను,” అంటూ ఎన్టీఆర్ కీరవాణి, రాజమౌళి కుటుంబాలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

“మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ చెయ్యాలి. సింహా, భైరవ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతి కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకునేందుకు వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను,” అన్నారు ఎన్టీఆర్.

More

Related Stories