5 కోట్ల కారు కొన్న ఎన్టీఆర్?

NTR

సినిమా స్టార్స్ కి ఖరీదైన కార్లు కొనడం ఇష్టం. అందులో ఆనందం వెతుక్కుంటారు. అలాంటి స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ లగ్జరీ ఫీచర్లతో పాటు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే… ఈ రెండింటి మేలు కలయికతో రూపొందిన ఇటాలియన్ లగ్జరీ కారు Lamborghini Urusని హైదరాబాద్ కి రప్పిస్తున్నాడట.

దాదాపు ఐదు కోట్లు (దిగుమతి సుంకం సహా) ఉండే ఈ కారుని ఇటీవలే ఎన్టీఆర్ బుక్ చేసినట్లు టాక్. ఇలాంటి కారు హైదరాబాద్ లో ఎవరికీ లేదు. అందుకే ఎన్టీఆర్ మోజుపడి తెప్పిస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి పారితోషికం బాగానే అందుతోంది. కానీ ఈ సినిమా షూటింగ్ బాగా జాప్యం కావడం వల్ల కొంత ఇంకమ్ దెబ్బతింది ఎన్టీఆర్ కి. ఆ లోటును ఒక టీవీ షో ఒప్పుకొని భర్తీ చేస్తున్నాడు.

జెమినీ టీవీ ప్రసారం చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని మూడు నెలల పాటు హోస్ట్ చేసేందుకు అంగీకరించాడు ఎన్టీఆర్. ఆ షో ద్వారా ముట్టిన డబ్బుతోనే ఈ కారు బుక్ చేసినట్లుంది. ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో కొత్త సినిమా షురూ చేస్తాడు.

More

Related Stories