ఎన్టీఆర్ 25 లక్షల విరాళం

NTR


ఆంధ్రపదేశ్ లో ఇటీవల భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కనీవినీ ఎరుగని వరద బీభత్సాన్ని చూశాయి. అనేక గ్రామాల్లో ఇంకా వరదనీరు ఉంది. సామాన్యులు కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా 25 లక్షల విరాళం ప్రకటించారు.

వరద ప్రాంత బాధితులకు సాయం అందేలా ఈ డొనేషన్ ఇస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్.

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆపద వచ్చినా సాయం చేసేందుకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలు ముందుంటారు. హైదరాబాద్ వరదలు, హుదుహుద్ తుపాను… ఇలా అన్ని సందర్భాల్లో మన హీరోలు తమ వంతు సాయం అందించారు. ఎన్టీఆర్ ఈ సారి మిగతా వారికన్నా ముందు ఆర్థిక సాయం ప్రకటించారు.

 

More

Related Stories