న్యూయార్క్లో ఫుడ్ అదుర్స్: ఎన్టీఆర్

- Advertisement -


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్యాపిల్లలతో కలిసి అమెరికా ట్రిప్పు వేశారు. కొత్త ఏడాది సంబరాలు అక్కడే. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని ఒక ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం చేశారట. అక్కడ ఫుడ్ అదుర్స్ అంటూ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఎన్టీఆర్.

న్యూయార్క్ నగరంలో ఉన్న “జునూన్” అనే దేశి రెస్టారెంట్ లో ఇండియన్ ఫుడ్ నా అభిరుచికి తగ్గట్లు ఉంది అని ఎన్టీఆర్ ఒక ఫోటో కూడా షేర్ చేశారు. ఆ రెస్టారెంట్ స్టాఫ్ తో ఒక ఫోటో దిగారు. దాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం.

సాధారణంగా ఎన్టీఆర్ ఎప్పుడూ ఫుడ్ గురించి కానీ, రెస్టారెంట్ ల గురించి కానీ పోస్టులు పెట్టరు. కానీ విదేశాల్లో అచ్చమైన ఇండియన్ ఫుడ్ పొందడం కష్టమే. అందుకే, ఈ రెస్టారెంట్ ఫుడ్ నచ్చి పోస్ట్ చేసినట్లు ఉంది. లేదూ ‘ఆబ్లిగేషన్’ పోస్ట్ అయినా అయి ఉండొచ్చు.

మొత్తమ్మీద, ఎన్టీఆర్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారని అభిమానులకు అర్థమైంది.

 

More

Related Stories