ఫ్యామిలీ వెకేషన్లో తారక్

NTR


మరోసారి విదేశాలకు వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. భార్య, కొడుకులతో కలిసి ఎన్టీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తాతయ్య నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లారు.

పిల్లల స్కూల్ వచ్చే నెల 12న మొదలవుతాయి. ఈ లోపు చిన్న వెకేషన్.

ఎన్టీఆర్ ఇప్పటివరకు ‘దేవర’ సినిమాకి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తి చేయడం విశేషం. వచ్చే నెలలో మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేయాలనీ పట్టుదలగా ఉంది ‘దేవర’ టీం.

Advertisement
 

More

Related Stories