బుచ్చి గురించి చెప్పని జూనియర్


జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ‘వెరైటీ’ అనే హాలీవుడ్ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. “ఆర్ ఆర్ ఆర్” సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ వచ్చింది. ‘RRR’ విషయాలు పక్కన పెడితే, ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన తదుపరి రెండు చిత్రాల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

“కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ ఉంటుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ చిత్రం అక్టోబర్ 2022లో మొదలవుతుంది,” అని ఎన్టీఆర్ తెలిపారు. ఈ సినిమాల గురించి మనకు ఇంతకుముందే తెలుసు. ఐతే, ఎప్పుడు ఏ చిత్రం షురూ అవుతుందనే విషయంలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.

కానీ, దర్శకుడు బుచ్చిబాబు గురించి ఒక్క మాట చెప్పలేదు. ‘ఉప్పెన’ తీసిన బుచ్చిబాబు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనే అన్నట్లుగా హింట్ ఇచ్చారు.

కానీ, ఎన్టీఆర్ 2022 క్యాలెండర్ మొత్తం పై రెండు సినిమాలకే కేటాయించినట్లు కనిపిస్తోంది. బుచ్చిబాబు సినిమాని ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు చేస్తారా లేక 2023కి తోస్తారా అన్నది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా సినిమాకి అంచనాలు అందుకోవడం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యం అని అంటున్నారు ఎన్టీఆర్.

 

More

Related Stories