
“ఆర్ ఆర్ ఆర్” టీం అన్ని పనులు పూర్తి చేసుకొని సినిమా ప్రొమోషన్ మొదలు పెట్టింది. అందుకే రిలాక్సెడ్ గా, పద్దతిగా ప్రొమోషన్ చేస్తున్నారు. ట్రైలర్ తో సినిమాకి తెచ్చిన హైప్, ఊపు గురించి చెప్పక్కర్లేదు. ఐతే, అంతటితో ఊరుకోవడం లేదు. ముంబైలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందే రాసినట్లు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తారు.
హైదరాబాద్ లో కూడా ఒక భారీ ఈవెంట్ ఉంటుంది. దుబాయ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఐతే, ఆన్ లైన్ లో మాత్రం ప్రతిరోజూ ఎదో ఒక హడావిడి ఉండేలా చూసుకుంటోంది టీం.
తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కొత్త ఫోటోలు విడుదల చేశారు. బైక్ మీద స్టైల్ గా వస్తోన్న కొమరం భీమ్ అవతారంలో ఎన్టీఆర్, ఒక పోస్ట్ బాక్స్ పై చెయ్యి వేసి నిల్చున్న అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఈ ఫొటోల్లో కనిపిస్తారు. ఇప్పటివరకు వచ్చిన వీడియోల్లో, ప్రోమోలల్లో, ట్రైలర్స్ లో ఈ లుక్ లేదు. దాంతో, ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.
“ఆర్ ఆర్ ఆర్” వచ్చే నెల 7న విడుదల కానుంది. మార్కెటింగ్ విషయంలో రాజమౌళి టీం మాత్రం చాలా గ్రాండ్ ఆలోచనలతో వెళ్తోంది. మరో, బాహుబలి 2 లా ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది.