థాంక్యూ మామయ్య: ఎన్టీఆర్


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, జూనియర్ ఎన్టీఆర్ కి పడట్లేదు అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ చాలా కాలంగా చంద్రబాబు విషయాల్లో అంత ఆసక్తి చూపడం లేదనేది వాస్తవమే. కుటుంబ ఫంక్షన్లలో తప్ప ఇతర సందర్భాల్లో వీరు కలుసుకున్నది లేదు. అందుకే, తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఒక రిప్లై వైరల్ అయింది.

చంద్రబాబును మామయ్యా అని ఆప్యాయంగా పిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలోని “నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సందర్భంగా టీం ని అభినందిస్తూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణితో పాటు టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఐతే, కీరవాణితో పాటు రాజమౌళిని మాత్రమే ట్యాగ్ చేశారు.

ఆయన ట్వీట్ కి స్పందించి జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. ధ్యాంక్యూ సోమచ్ మామయ్యా అని ఎన్టీఆర్ ట్వీట్ చెయ్యడం, అది వేగంగా వైరల్ కావడం జరిగింది. వేలల్లో లైకులు వచ్చాయి. తనని ట్యాగ్ చేయకున్నా ఎన్టీఆర్ స్పందించడం విశేషమే.

“ఆర్ ఆర్ ఆర్” సినిమాకి అమెరికాలో వస్తున్న స్పందన, అవార్డుల హడావుడితో ఎన్టీఆర్ చాలా ఎక్కువ ఆనందంగా కనిపిస్తున్నారు. గ్లోబల్ ఫేమ్ దక్కిందని భావన ఆయనలో కనిపిస్తోంది.

 

More

Related Stories