మూడు నెలలు అటు, ఇటు!

NTR

రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రం షూటింగ్ షురూ చెయ్యాలి. ఎన్టీఆర్30 చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారు. ఈ మూవీని ఎప్పుడో ప్రకటించేశారు. రెగ్యులర్ షూటింగ్ మే చివర్లో కానీ, జూన్ లో కానీ మొదలవుతుంది.

ఈ సినిమాతో పాటు “మీలో ఎవరు కోటీశ్వరులు” అనే టీవీ షో కూడా చెయ్యాలి. ప్రతివారం రెండు రోజులు టీవీ షో షూటింగ్ లో పాల్గొంటాడు ఎన్టీఆర్. మే మొదటివారంలో మొదలవుతుందిది. రెండున్నర నెలల పాటు సాగే ఈ షోతో పాటు త్రివిక్రమ్ షూటింగ్ లో కూడా పాల్గొంటాడు. అంటే.. అటు ఇటు రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటాడు ఎన్టీఆర్.

ఈ షో వల్ల ఎన్టీఆర్ కి దాదాపు 10 కోట్ల పారితోషికం ముడుతుంది. అంటే.. రెండున్నర నెలలో కూల్ గా 10 కోట్లు తన అకౌంట్లో వేసుకుంటాడు.

ఈ షో పూర్తికాగానే, ఎన్టీఆర్ అటు “ఆర్ ఆర్ ఆర్” ప్రొమోషన్ లలో కూడా పాల్గొనాలి. అక్టోబర్ 13న విడుదల కానుంది “ఆర్ ఆర్ ఆర్”. అంటే ఎన్టీఆర్ ఈ ఏడాది మల్టిటాస్కింగ్ చెయ్యాల్సిందే.

More

Related Stories