సోమవారం అమెరికా పయనం

- Advertisement -
NTR


జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పటికే అమెరికాలో యమా క్రేజ్ వచ్చింది. ఆస్కార్ అవార్డుల ప్రమోషన్ కోసం ఇంతకుముందు అమెరికాలో తెగ హల్చల్ చేశారు ఎన్టీఆర్. పెద్ద పెద్ద అమెరికన్ మీడియా కంపెనీలు ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేశాయి. ఎన్టీఆర్ కూడా అద్భుతంగా మాట్లాడి అక్కడి మీడియాని ఇంప్రెస్ చేశారు.

ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ క్రిటిక్స్, ఫిల్మ్ మేకర్స్ ఫిదా అయ్యారు. ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వచ్చే వారమే బయలుదేరనున్నారు. మార్చి 12న (ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం) అవార్డులు అందచేస్తారు.

ఇదీ చదవండి: క్లీవేజ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీప్తి సునయన!

వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ మరోమారు అమెరికన్ మీడియాలో హల్చల్ చెయ్యనున్నారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ మేకర్స్ ని కూడా వ్యక్తిగతంగా కలుస్తారట.

ఈ నెలాఖరులో ఇండియాకి వచ్చిన తర్వాత దర్శకుడు కొరటాల శివ సినిమా మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటారు.

 

More

Related Stories