ఏప్రిల్ నుంచి ‘వార్ 2’లో ఎన్టీఆర్

NTR

హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ “వార్ 2” సినిమా చెయ్యనున్నాడు. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ పాత్ర చెయ్యడం లేదు. అలాగే విలన్ గా కూడా నటించడం లేదు. హృతిక్ రోషన్ కి సమానమైన పాత్రలో నటిస్తారు ఎన్టీఆర్. ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది స్పష్టంగా చెప్పలేనివిధంగా హృతిక్, ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉంటాయట.

మరోవైపు, ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హృతిక్ రోషన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ముంబైలోని యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేసి సినిమా చిత్రీకరిస్తున్నారు. ఇదే సెట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొనాలి.

ప్రస్తుతం ఎన్టీఆర్ “దేవర” సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చేనెలాఖరుకు “దేవర” పూర్తి చేసి ఆ వెంటనే “వార్ 2” షూటింగ్ లో పాల్గొంటారట. ముందుగా ఎన్టీఆర్, హృతిక్ సీన్లు తీస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఇతర సీన్లు చిత్రీకరిస్తారు.

“వార్” మొదటి భాగంలో హృతిక్, టైగర్ స్రోప్ నటించారు. రెండో భాగంలో హృతిక్ కంటిన్యు అవుతున్నాడు. కొత్తగా ఎన్టీఆర్ వచ్చి చేరారు.

More

Related Stories