- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ కి కూడా కరోనా సోకింది. దాంతో, వారు ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్తిస్తున్నామంటూ పలువురు రాజకీయ నాయకులు, సినిమా తారలు ట్వీట్లు చేశారు. చిరంజీవి కూడా ఉన్నారు అందులో.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ బాగా వైరల్ అయింది.
“మామయ్య చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని,” ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. కొంతకాలంగా ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య సంబంధాలు అంతగా బాలేవు. దాంతో ఈ ట్వీట్ అటు నందమూరి అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది. అందుకే ట్వీట్ వైరల్‌గా మారింది.