‘ఎన్టీఆర్30’కి పలు మార్పులు!

- Advertisement -


ఎన్టీఆర్ తదుపరి చిత్రం జూన్ లో మొదలు కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు ఇటీవల. ఆయన ప్రకటన ఎలా ఉన్నా.. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేసరికి జులై, ఆగస్టు అవుతుంది అనేది ఇన్సైడ్ టాక్.

ఐతే, ఈ సినిమా విషయంలో ముందు అనుకున్న ప్లాన్ వేరు. ఇప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’, ‘కేజీఎఫ్’ విడుదల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ కొన్ని ప్రధానమైన ఛేంజెస్ చేయబోతున్నారట.

హీరోయిన్, సంగీత దర్శకుడు, కెమెరామేన్, స్క్రిప్ట్, బడ్జెట్… ఇలా అన్ని రకాల మార్పులుంటాయి. ‘ఆచార్య’ సినిమా విడుదల అయిన వారం రోజుల తర్వాత ఆ సినిమాని మర్చిపోయి… పూర్తిగా #ఎన్టీఆర్30 సినిమా పైనే కొరటాల ఫోకస్ పెడుతారు.

ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అనేక అంశాలు సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోపు ఉండవు.

కొరటాల శివ మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మంచి విజయం సాధించింది.

 

More

Related Stories