
ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఆగిపోయింది అని కొన్ని మీడియా సైట్స్ లలో తెగ ప్రచారం జరిగింది. ఇన్నాళ్లూ మౌనం వహించిన ఎన్టీఆర్, కొరటాల టీం ఇన్నాళ్లకు నిద్రలేచింది. అధికారికంగా ఒక ప్రకటన చేసింది. కొన్ని ఫోటోలు విడుదల చేసింది.
ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్న సినిమాకి సంబందించిన టెక్నీషియన్ల వివరాలు కూడా వెల్లడించారు. కొరటాల శివ తన టీమ్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్న ఫోటోలని విడుదల చేశారు. “సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని అందించటానికి సిద్ధమవుతున్నారు కొరటాల శివ,” అని టీం ప్రకటించింది.
ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమా హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని ఇంకా తెలుపలేదు. ఐతే, ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం ఇస్తున్నాడు అన్న విషయం ఇంతకుముందే అందరికీ తెలుసు. తాజాగా, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను బయటపెట్టారు.
‘రంగస్థలం’ , ‘2.0’ వంటి చిత్రాలకు పనిచేసిన రత్నవేలు ఈ సినిమాకి కెమెరామేన్. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు పనిచేసిన సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తారు. సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ నిర్మాతలు.
Also Check: NTR30: Koratala Siva begins pre-production