ఎన్టీఆర్ ఇంటి పక్కనే సెట్!

NTR


ఎన్టీఆర్ – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు, ఎన్టీఆర్ కూడా ‘ఆర్ ఆర్ ఆర్’కి సంబంధించిన చివరి పనులు పూర్తి చేసుకుంటున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఈ సినిమా కోసం భారీ సెట్స్ వెయ్యనున్నారట. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ కోసం కొరటాల శివ గ్యారేజ్ సెట్ వేయించారు. ఇప్పుడు కొత్త సినిమా కోసం కూడా ఒక భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ కొరటాల శివ స్వయంగా తెలిపారు. అంతే కాదు, ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే అంటే జూబ్లీహిల్స్ లోనే ఈ సెట్ నిర్మిస్తారట. సినిమా ఎక్కువ భాగం ఈ సెట్ చుట్టే తిరుగుతుంది.

సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించే ఈ చిత్రానికి అనిరిధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

దసరాకి ముందే సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తారు.

 

More

Related Stories