ఎన్టీఆర్ సినిమా కూడా లేటే!

NTR

జూన్ మూడో వారం నుంచి ఎన్టీఆర్ 30వ సినిమా సెట్స్ పైకి వస్తుంది అని ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చెయ్యనున్నారు. జూన్ మూడో వారం నుంచి షూటింగ్ మొదలవుతుంది అని గత నెలలో చెప్పారు. కానీ కొవిడ్ 19 రెండో వేవ్ అందరి ప్లాన్స్ తారుమారు అయ్యాయి.ఈ సినిమా చాలా లేటు కానుంది.

ముందుగా దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యాలి. కేసుల ఉధృతి తగ్గితేనే ‘ఆచార్య’ షూటింగ్ మొదలవుతుంది. అలాగే, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ కి కూడా గుమ్మడికాయ కొట్టాలి. సో, అనివార్యంగా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా లేట్ గా ప్రారంభం అవుతుంది.

ఎన్టీఆర్, శివ కొరటాల కాంబినేషన్లో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రెండో మూవీ రానుంది. దీనికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాత.

More

Related Stories