- Advertisement -

నందమూరి ఇంట విషాదం. దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావు నాలుగో కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి కన్ను మూశారు. ఆమె హీరో నందమూరి బాలకృష్ణకి సోదరి.
కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఎన్టీ రామారావుకి 11 మంది పిల్లలు. నలుగురు ఆడపిల్లలు. ఉమామహేశ్వరి నాలుగో కూతురు.
సమాచారం తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు.