
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్న “దేవర” షూటింగ్ ఈ రోజు గోవాలో మొదలైంది. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు ఇప్పుడు. ఐదు రోజుల పాటు గోవాలోనే షూటింగ్.
ఈ సినిమా కథ అంతా చరిత్ర మర్చిపోయిన కొన్ని ద్వీపాల నేపథ్యంగా సాగుతుంది. అందుకే ఈ సినిమాని గోవా, కేరళ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా తీశారు, తీస్తున్నారు. కానీ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లోనే చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
గోవాలో షూటింగ్ పూర్తి అయ్యాక మరో వారం రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతారు. దాంతో టాకీ పార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నాలుగు పాటలు తీయాల్సి ఉంటుంది.
ఐతే, పాటలు తీయకముందే ఎన్టీఆర్ “వార్ 2” షూటింగ్ లో పాల్గొంటారు. ఏప్రిల్ లో ఎన్టీఆర్ “వార్ 2″లో పాల్గొనాలి.