
ఎన్టీఆర్ – రామ్ చరణ్ లపై ఉక్రెయిన్ లో ఒక భారీ పాటని తీస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ షూటింగ్ గ్యాప్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక పిట్టగోడపై కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోని టీం విడుదల చేసింది. ఈ వీడియోలో ఎన్ఠీఆర్ గాయంతో కనిపించారు. ఎన్టీఆర్ కణతి (టెంపుల్)పై దెబ్బ తగిలినట్లు అభిమానులు నోటిస్ చేశారు.
“అన్నా ఏమైంది…. జాగ్రత్తగా ఉండు…” అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది షూటింగ్ లో గాయపడ్డ దెబ్బనా లేక సినిమా కోసం వేసిన మేకప్పా తెలియక ఫ్యాన్స్ వర్రీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అస్సలు దాని గురించే ఆలోచించడం లేదు. అంటే అభిమానులు కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు.
ఈ ఉక్రెయిన్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతారట. షూటింగ్ పూర్తి కాగానే, ఎన్టీఆర్ కొద్దీ రోజులు రెస్ట్ తీసుకోని తన తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతారు. కొరటాల శివ డైరెక్షన్లో కొత్త సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఇప్పుడు రెండో చిత్రం. ఈ సినిమా అక్టోబర్ లో మొదలు కావొచ్చు.
ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే, నార్త్ ఇండియా మార్కెట్ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. అక్టోబర్ నాటికి పరిస్థితులు చక్కబడుతాయని రాజమౌళి టీం ధీమాగా ఉంది.