బీజేపీ డిమాండ్… రాజమౌళి మారుస్తాడా?

NTR in RRR

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ గ్రేట్ పవర్ చూపించింది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సంపాదించిన పార్టీ ఇప్పుడు ఏకంగా 49 సీట్లు గెలిచింది. ఇంకా తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మరింత దూకుడుగా వెళ్తుంది. దాంతో మరోసారి కొమరం భీమ్ గురించి ఫోకస్ పడనుంది. హిందూ – ముస్లిం కార్డుని బీజేపీ వాడుతోంది. అదే ప్రధాన అస్త్రం ఆ పార్టీకి ఇక్కడ ఎదగడానికి.

ఇంతకుముందే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద వివాదం క్రియేట్ చేసింది. ఇందులో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో ఉన్నట్లు చూపించారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై దర్శకుడు రాజమౌళి ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. మరి ఇప్పుడు రాజమౌళి ఆ సీన్ ని తొలగిస్తాడా? లేదంటే బీజేపీ ఆగ్రహానికి గురి అవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
 

More

Related Stories