
‘ఆర్.ఆర్.ఆర్’ రెండో టీజర్ తో అన్ని అనుమానాలు పటాపంచలు అయ్యాయి. మేకింగ్ లో రాజమౌళి ఇతర దర్శకులకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ విజువల్ క్వాలిటీ, హీరోయిజం ఎలివేషన్ ఆయనకి మాత్రమే సాధ్యం.
ఇప్పటివరకు తీసిన విజువల్స్ లో దమ్ము లేదని, అందుకే “భీమ్” టీజర్ విషయంలో రాజమౌళి కిందా మీదా అవుతున్నాడని పుకార్లు వచ్చాయి. కానీ, ఈ టీజర్ తో మైండ్స్ బ్లాక్ అయ్యాయి.
ఎన్టీఆర్ ని కొత్తగా చూపించగలడా అన్ని అనుమానాలు కూడా రద్దు అయ్యాయి. భీమ్ గా బీస్ట్ మోడ్ లో ప్రెజంట్ చేశాడు ఎన్టీఆర్ ని. అటు అల్లూరి, ఇటు భీం… రెండు పాత్రలని తనదైన కమర్షియల్ పంథాలో చూపిస్తున్నాడు రాజమౌళి. టీజర్ తో మళ్ళీ చించేశాడుగా అన్ని టాక్ వచ్చేసింది.
“వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..
వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్…”
టీజర్ లో ఉన్న ఈ డైలాగ్స్ ని రాంచరణ్ చెప్పిన విధానం కూడా ఆకట్టుకొంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఐతే, ఈ సినిమా కథలో “బాహుబలి”లా పాన్ ఇండియా అంతా నచ్చే మెటీరియల్ ఉందా అనేది ట్రైలర్ వస్తే గాని అర్థం కాదు.