అమ్మ కోసం కమ్మని వంట

Kammani Vanta

అమ్మ..ఎన్ని యుగాలు మారినా,ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం..

అనంతమైన ప్రేమను తన బిడ్డలకు పంచే ప్రతి మాతృమూర్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ…. అంతులేని అనురాగాల్ని , అద్భుతమైన స్నేహాన్ని, అలుపెరుగని ఓర్పుని పంచె అమ్మ గొప్పతనానికి ప్రతీకగా NTV Entertainment అమ్మకు ప్రేమతో… కమ్మని వంట కార్యక్రమం నిర్వహించబోతుంది.

మనల్ని నిత్యం అలరించే మన అభిమాన నటీ,నటులు వాళ్ళ అమ్మలతో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతని, వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, జయ, అపజయాలని తెలియజేయడంతో పాటు అమ్మకు ప్రేమతో కమ్మని వంటను స్వయంగా వండి తినిపిస్తూ ప్రేమని చూపించే కార్యక్రమమే ఈ అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట..

తల్లి బిడ్డల ప్రేమకు అద్దంలా.. మనకోసం అనునిత్యం శ్రమించే అమ్మకు ప్రేమతో పంచే క్షణాలే ఈ Tenali Double Horse presents అమ్మకు ప్రేమతో కమ్మని వంట.

(press release)

 

More

Related Stories