కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి చిత్రం… టైగర్ నాగేశ్వర రావు. రవితేజ సరసన నటించింది ఈ భామ. ఈ భామతో ముచ్చట్లు…
మార్వాడి అమ్మాయి పాత్ర
“టైగర్ నాగేశ్వరరావులో నా పాత్ర పేరు సార. మార్వాడీ అమ్మాయిగా నటించాను. గ్లామర్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన పాత్ర. ఐతే, కథకు కీలకమైన పాత్ర. మొదటి సినిమాలోనే ఛాలెంజింగ్ పాత్ర దక్కడం అదృష్టం.”
తెలుగులో నటించడం బాగుంది
మా సిస్టర్ కృతి సనన్ కూడా తెలుగులోనే తన కెరీర్ ప్రారంభించింది. నేను కూడా ఇక్కడి నుంచే జర్నీ మొదలుపెట్టాను. మొదటి చిత్రంలోనే మాస్ మహారాజా రవితేజ గారి సరసన చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 200 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశాకే నాకు దక్కింది అవకాశం. దర్శకుడు వంశీ గారికి కథపైనే కాదు పాత్రల విషయంలో చాలా క్లారిటీ వుంది. ఆయన చెప్పినట్లుగా నటించాను. రవితేజ గారికి హిందీ బాగా వచ్చు. నా పని సులువు అయింది. ఈ సెట్ లో హ్యాపీ.
ఆమె మాట
“కృతి నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా ఏంటంటే – ‘నువ్వు నీలా వుండు’. నేను తను చెప్పింది పాటిస్తున్నా. ఫాలో అవుతున్నా.”
ఇష్టమైన హీరో, హీరోయిన్స్…
సాయి పల్లవి చాలా ఇష్టం. “ఫిదా” చూసి ఫిదా అయిపోయా. అనుష్క శెట్టి, కీర్తి సురేష్ అంటే కూడా ఇష్టం. హీరోల్లో నాని గారు అంటే ఇష్టం. అలాగే రామ్ పోతినేని, విశ్వక్ సేన్ కూడా ఇష్టం.