
బాలీవుడ్ లో హీరోల కొడుకుల కన్నా కూతుళ్లే ఎక్కువగా నట వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో పేరొందిన కొత్త తరం హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, శ్రద్ధ కపూర్ వంటి వారందరూ తల్లితండ్రుల బాటలో వచ్చినవారే.
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిగా అడుగుపెడుతోంది. అదే బాటలో నైస దేవగన్ ఎంట్రీ ఇవ్వనుంది.
అజయ్ దేవగన్, కాజోల్ ల కూతురు నైస దేవగన్ (Nysa Devgan). అమెరికాలో చదువుకొని వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు చూస్తే చాలు ఆమె నటిగానే కెరీర్ ఎంచుకోనుంది అని అర్థమవుతోంది.
కాజోల్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. కానీ, అజయ్ దేవగన్ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తుండగానే ఆయన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండడం విశేషమే.