ఇక ఆఫర్లు మొదలయ్యాయి!

Adah Sharma


అదా శర్మ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ‘ది కేరళ స్టోరీ’తో ఆమెకి స్టార్ డం వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విడుదలై వారం రోజులు కాకముందే ఆమె హీరోయిన్ గా కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

“ది గేమ్ ఆఫ్ గిర్గిత్” అనే పేరుతో శ్రేయాస్ తల్పడే హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గతంలో పలువురు హీరోయిన్లని అనుకున్నారు. కానీ, ‘ది కేరళ స్టోరీ’ సూపర్ హిట్ కాగానే ఆమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ప్రకటన ఈ రోజు వచ్చింది.

తెలుగులో అదా శర్మ ‘హార్ట్ అటాక్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గరం’, ‘క్షణం’, ‘కల్కి’ వంటి సినిమాల్లో నటించింది. మొదట్లో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆమె ఆ తర్వాత దాన్ని నిలుపుకోలేదు. సో, కొన్నేళ్లుగా ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆమె ఫేట్ మారింది. ‘ది కేరళ స్టోరీ’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సో, ఇకపై ఆమెకి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి.

అదా శర్మ ఈ క్రేజ్ ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

 

More

Related Stories