ఓజి ముందుకు, ఉస్తాద్ వెనక్కి!

OG


“ఓజి” సినిమా టీజర్ రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా టీజర్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. మొదటి లుక్ పోస్టర్ ఏమి లేదు కానీ డైరెక్ట్ గా టీజర్ విడుదల చేస్తామని చెప్పింది ఆ సంస్థ.

సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న “ఓజీ” సినిమా టీజర్ గురించి ఇప్పటికే చాలా హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాఫియా గ్యాంగ్ లీడర్ గా నటిస్తున్నారు. సుజీత్ పవన్ కళ్యాణ్ ని చాలా స్టైల్ గా చూపించనున్నారట.

మరోవైపు, పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పక్కన పెట్టి హరీష్ శంకర్ డైరెక్క్షన్ లో రూపొందుతోన్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అని ఆ మధ్య ప్రచారం జరిగింది. “ఓజీ” కన్నా ముందే “ఉస్తాద్” విడుదల అవుతుంది అని, “బ్రో” ఫ్లాప్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అని చాలా కథనాలు అల్లేశారు. కానీ ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే “ఓజీ” వెనక్కి వెళ్లడం లేదు.

“ఉస్తాద్ భగత్ సింగ్” కన్నా ముందే “ఓజీ” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వడం ఖాయం. “ఉస్తాద్” విడుదలే వెనక్కి వెళ్ళింది.

Advertisement
 

More

Related Stories