
మార్చి (2024)లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి నుంచే అన్ని పార్టీలు హడావుడి మొదలు పెడుతాయి. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కేవలం రెండు నెలల టైం మాత్రమే ఉంది తన టైంని షూటింగ్ లకు కేటాయించేందుకు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ “ఓజి” షూటింగ్ మాత్రమే పూర్తి చేస్తారు. ఎందుకంటే దర్శకుడు సుజిత్ ఇప్పటికే 70 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ ఇస్తే మిగతా మొత్తం కంప్లీట్ చేస్తాడు సుజిత్. అందుకే, “ఓజీ” మాత్రమే ఎన్నికలలోపు విడుదల అవుతుంది.
హరీష్ శంకర్ తీస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జరుగుతుంది. దాని విడుదల తేదీ ఎప్పుడు అనేది ఏపీ ఎన్నికల తర్వాత తేలుతుంది.
అలాగే, “హరి హర వీర మల్లు” భవితవ్యం కూడా ఎన్నికల తర్వాతే. హరీష్ శంకర్ తాజాగా రవితేజతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.