ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ కి నాగ్ కితాబు

- Advertisement -
Oka Chinna Family Story | Official Trailer | A ZEE5 Original | Streaming Now on ZEE5


‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ( ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘జీ 5’. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటించారు. నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను ఈ రోజు నాగార్జున విడుదల చేశారు. 

మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ట్రైలర్ నునాగార్జున మెచ్చుకున్నారు. “ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నేను కూడా వెయిటింగ్,” అని అన్నారు.

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) గురించి నిహారికా కొణిదెల: “ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. నవంబర్ 19న విడుదల చేస్తున్నాం.”

చక్కటి వినోదం, ప్రేమకథతో కూడిన వెబ్ సిరీస్ ఇదనీ… హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు నరేష్, తులసి, బామ్మ పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయని ‘జీ 5’ ప్రతినిధులు తెలిపారు.

 

More

Related Stories