సెన్సార్ బోర్డు మెంబర్ గా ఓం

Om Prakash Narayana

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణకి సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి) హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు.

ఓం ప్రకాష్ నారాయణ గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన మంచి కార్టూనిస్ట్ కూడా. 1989లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా చేశారు. రెండున్నర దశాబ్దాలుగా జాగృతి వార పత్రికలో సమీక్షలు రాస్తున్నారు.

ప్రస్తుతం NTV ఛానెల్ లో అసోసియేటెడ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

More

Related Stories