సుశాంత్ మరణంపై పుస్తకం?

Sushant

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి రోజుకో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మరణంపై ఇప్పుడో పుస్తకం కూడా రాబోతోందనే న్యూస్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాకపోతే ఇది పక్కా కాదు. కేవలం అనుమానం మాత్రమే.

ఇండియన్ ఫేమస్ రైటర్ చేతన్ భగత్ గురించి అందరికీ తెలిసిందే. “త్రీ ఇడియట్స్”, “టు స్టేట్స్” లాంటి సినిమాలు ఆయన నవలల ఆధారంగా తెరకెక్కినవే. ఇప్పుడీ రచయిత తన కొత్త నవల టైటిల్ ప్రకటించాడు. దాని పేరు “వన్ అరేంజ్డ్ మర్డర్”.

ఈ టైటిల్ ఎనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే అంతా ఈ టైటిల్ ను, సుశాంత్ మరణానికి అన్వయిస్తున్నారు. నిజానికి ఈ ప్రచారం 10 రోజులుగా నడుస్తూనే ఉంది. ఈరోజు చేతన్ తన నవల టైటిల్ బయటపెట్టిన తర్వాత ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

Related Stories