చిరంజీవి ప్రకటనకు ఏడాది

Chiranjeevi

సరిగ్గా ఏడాది క్రితం…. ఇండియా అంతా లాక్డౌన్. వారం రోజులు ఉంటుందేమో అనుకున్న లాక్డౌన్ దాదాపు 40 రోజుల పాటు కఠోరంగా సాగింది. ఆ టైంలో ఎవ్వరికీ ఏమి అర్థం కానీ పరిస్థితి. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ఇంకా ఇతర సెలెబ్రిటీలు టీవీ ఛానెల్స్ లైవ్ లోకి వచ్చి పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చారు. జనాలకి కాస్త వినోదం, కొంత ధైర్యం కల్పించారు తమ మాటలతో.

ఆ లైవ్ ఇంటర్వ్యూల సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి మూడు కొత్త సినిమాలు ప్రకటించారు. అప్పటికి 40 శాతం పూర్తయిన ‘ఆచార్య’ ముగిసిన వెంటనే మూడు సినిమాలను ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తానని చెప్పారు. చిరంజీవి ఈ వయసులో స్పీడ్ పెంచడం గ్రేట్ అనిపించింది.

ఐతే, క్యాలెండర్ లో 365 రోజులు వెళ్లిపోయాయి. మళ్ళీ కరోనా వేవ్ ని చూస్తున్నాం. ఈ సారి లాక్డౌన్ లేదు కానీ అదే అనిశ్చితి!

ఏడాదిలో చిరంజీవి సినిమాల ప్లాన్ ఏమైంది అంటే… ‘ఆచార్య’ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టలేదు. ఇంకా ఆ సినిమాని తీయాలి. గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన మూడు సినిమాల్లో ఒకటి మాత్రం (లూసిఫర్ రీమేక్) లాంఛనంగా లాంచ్ అయింది. షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. మిగతా రెండు సినిమాలు – మెహర్ రమేష్ డైరెక్షన్లో ఒకటి, బాబి డైరెక్షన్లో మరోటి – సంగతి ఇప్పట్లో మాట్లాడలేం. ‘ఆచార్య’ విడుదలై, ‘లూసిఫర్ రీమేక్’ షూటింగ్ పూర్తి అయితే కానీ ఆ రెండు సినిమాల్లో కదలిక ఉండదు.

Advertisement
 

More

Related Stories