ఓన్లీ బాలయ్య… దర్శకుడి క్లారిటీ

- Advertisement -
Balakrishna


వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి “ఎఫ్ 3” చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఆ తర్వాత ఆయన బాలయ్య హీరోగా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ అంగీకారం తెలిపారట.

ఐతే, ఈ సినిమాలో బాలయ్యతో పాటు రవితేజ కూడా నటించున్నారని ప్రచారం మొదలైంది. ఇది మల్టీస్టారర్ అని అంటున్నారు.

కానీ, ఈ వార్తలను తోసిపుచ్చారు రావిపూడి. “బాలయ్యకి ఎప్పుడో కథ చెప్పాను. స్క్రిప్ట్ లాక్ అయింది. ఈ సినిమా గురించి ఏ విషయాలు అయినా ఎఫ్ 3 రిలీజ్ తర్వాతే మాట్లాడుతా. ఇప్పుడు ఆ మూవీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు,” అని రావిపూడి అంటున్నారు.

బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తి అయిన తర్వాతే అనిల్ రావిపూడి మూవీ మొదలవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.

 

More

Related Stories