నాలుగేళ్లు.. పోస్టర్ మాత్రమే వేశాడు

గూఢచారి సినిమా 2018లో వచ్చింది. పెద్ద హిట్టయింది. ఆ వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించారు. అయితే ప్రకటన అయితే చేశారు కానీ, దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. చాలామంది ఆ సినిమా సగం షూట్ పూర్తయిందని అనుకున్నారు. కానీ హీరో అడివి శేష్ మాత్రం అసలు విషయం చెప్పేశాడు. సీక్వెల్ కు సంబంధించి పోస్టర్ తప్ప ఏమీ లేదని ప్రకటించాడు.

“గూఢచారి హిట్టవ్వగానే వెంటనే సీక్వెల్ ఎనౌన్స్ చేశాం. 2018లో ఎనౌన్స్ చేశాం. మధ్యలో మేజర్ ప్రాజెక్టు వచ్చింది. 3 దశల కరోనా వచ్చింది. దీంతో అది స్టార్ట్ అవ్వలేదు. కానీ చాలామంది మాత్రం గూఢచారి-2 షూటింగ్ నడుస్తోందని అనుకుంటున్నారు. ఇప్పటివరకు మేం చేసింది ఏంటంటే పోస్టర్ మాత్రమే వేశాం. పని స్టార్ట్ చేయలేదు.”

ఇలా గూఢచారి-2కు సంబంధించి అసలు విషయం బయటపెట్టాడు శేష్. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి కథ కూడా ఇంకా అనుకోలేదంట. మేజర్ సినిమా రిలీజైన తర్వాత గూఢచారి-2 మీద కూర్చుంటానని, అప్పుడు కథ-స్క్రీన్ ప్లే రెడీ చేస్తానని అంటున్నాడు శేష్.

 

More

Related Stories