‘భైరవకోన’లో చాలా ట్విస్టులున్నాయి!

సందీప్ కిషన్ హీరోగా “ఊరు పేరు భైరవకోన” అనే సినిమా రూపొందింది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి16న విడుదల కానుంది. ఇది కర్మ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది అని అంటున్నారు ఆనంద్.

“కథలో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివతత్త్వంలాంటివి ఉన్నాయి. మన చేసిన కర్మ వేరే విధంగా తిరిగివస్తుంది. ఈ ఫిలాసఫీతో సినిమా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం “గరుడపురాణం”లో వివరంగా ఉంది. దాన్ని ఈ సినిమాలో కొంత చూపించాం,” అని చెప్తున్నారు ఆనంద్.

“ఈ కథలో రెండు పెద్ద ట్విస్ట్ లు, మరికొన్ని చిన్న చిన్న ట్విస్ట్ లు ఉంటాయి. కథలో మలుపులు, పకడ్బందీ కథనం ఈ సినిమాకి బలం.”

ఈ సినిమా తర్వాత నిఖిల్ తో ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ దర్శకుడు.

Advertisement
 

More

Related Stories