ఏ రోల్ అయినా చేస్తా: దక్షి

- Advertisement -
Dakkshi

అచ్చ తెలుగు హీరోయిన్లు గ్లామరస్ గా ఉండరు అని ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బ్రేక్ చేసింది దక్షి గుత్తికొండ. మొదటి సినిమా రిలీజ్ కాకముంది ఈ భామ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అందచందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనుకాడదు. అలాంటో ఫొటోలతోనే కుర్రాళ్ళని ఆకట్టుకుంది సోషల్ మీడియాలో.

ఆమెకి ఉన్న గ్లామర్ ఇమేజ్ భిన్నంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించింది. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్లు ఫుల్లుగా ఎక్స్ పోజ్ చేస్తారు. కానీ వర్మ తీసిన “కరోనా వైరస్” అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు దక్షి గుత్తికొండ. ఆమెకి ఇదే మొదటి మూవీ.

“ఒక తెలుగు ఫ్యామిలీలో తమిళ కోడలి గా నటించాను. వంశి చాగంటికి భార్య పాత్ర నాది. నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్ గా అనిపించింది,” అని చెప్తోంది.

Also Check: Dakkshi Guttikonda – Photos

“ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే,” అని చెప్పింది దక్షి.

 

More

Related Stories