ఆస్కార్ బజ్ పెరుగుతోంది!

RRR

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఆస్కార్ నామినేషన్ వచ్చే అదృష్టం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ అలా ఉంది. తాజాగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక ఆస్కార్ ఓట్లు వేసే వారి మూడ్ ఎలా ఉందో తెలిపే లిస్ట్ వేసింది. బెస్ట్ ఫిలిం కేటగిరిలో ‘ఆర్ ఆర్ ఆర్’, బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో రాజమౌళి పేర్లు కొనసాగుతున్నట్లు తెలిపింది.

అంటే వోట్ వేసే సభ్యులు ఈ సినిమాని నామినేషన్ కోసం సీరియస్ గానే కన్సిడర్ చేస్తున్నారు. ఒకటి, రెండు కేటగిరిలో నామినేషన్ దక్కడం పక్కా అనిపిస్తోంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది… మరింత బజ్ క్రియేట్ చెయ్యడానికి.

మన దేశంలో ఇప్పటివరకు ఎందరో గొప్ప ఫిల్మ్ మేకర్స్, గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఆస్కార్ కి ప్రయత్నించినా అప్పుడు వారికి లక్ కలగలేదు. ఐతే, రాజమౌళి క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఉంది. ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అమెరికన్ ఫిల్మ్ మేకర్స్ కి బాగా నచ్చింది. కాబట్టి గత సినిమాలకు, ఈ సినిమాకి తేడా ఏంటంటే ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు దాదాపుగా అందరూ ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసేశారు. కాబట్టి, రాజమౌళి సినిమాకి పని సులువు అయింది.

అంతకుముందు, ఇతర దేశాలకు చెందిన సినిమాలను ఓట్లు వేసే వారిలో ఎక్కువమంది చూసేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ లు చెయ్యాల్సి వచ్చేది. పబ్లిసిటీకి చాలా ఖర్చు చెయ్యాల్సి వచ్చేది. ఆ ఖర్చు భరించలేక వదిలేసే ప్రయత్నాలను వదిలేసే వారు. రాజమౌళికి ఈసారి అన్ని కలిసి వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఆస్కార్ బజ్ పెరిగింది అనేది వాస్తవం.

Advertisement
 

More

Related Stories