ఒటిటి డేట్స్: ఉప్పెన, గాలి సంపత్, జాంబీ…

Gaali Sampath

థియేటర్లో విడుదలైన వారానికే ఒటిటి ప్లాట్ ఫార్మ్ లల్లోకి సినిమాలు రావడం అనే ట్రెండ్ మొదలైంది. రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు హీరోలుగా రూపొందిన ‘గాలి సంపత్’ ఆహాలో ఈ వీకెండ్ విడుదలవుతోంది. ఈ సినిమా మార్చి 11న థియేటర్లోకి వచ్చింది. అంటే ఎనిమిది రోజుల్లో ఓటిటికి వచ్చేస్తోంది.

అలాగే గత నెలలో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ అహాలోనే ఈ నెల 26న స్ట్రీమ్ కానుంది. ‘ఉప్పెన’ గత నెల 12న థియేటర్లోకి వచ్చింది. సినిమా అతిపెద్ద హిట్ రొమాంటిక్ మూవీగా నిలిచింది. అదిప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో వస్తుందట.

నిత్య మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ నటించిన ‘నిన్నిలా నిన్నిలా’జీ5లో ఈ నెల 19న స్ట్రీమ్ కానుంది.

More

Related Stories