అబ్బే పెళ్ళికి, గర్భానికి లింక్ లేదు!

Dia

దియా మీర్జా రెండు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకొంది. పెళ్లి చేసుకున్న 40 రోజులకే తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన బేబీ బంప్ ని చూపిస్తూ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తే ఆమె పెళ్ళికి ముందే గర్భవతి ఐనట్లు అర్థమవుతోంది అని కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ పై దియా స్పందించింది.

గర్భవతి కావడం వల్లే తాను హడావిడిగా పెళ్లి చేసుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. “మేం పెళ్లి చేసుకోవాలని ఇంతకుముందే డిసైడ్ అయ్యాం. కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నాం. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకొనే దశలోనే నేను గర్భం దాల్చను. సో… మా పెళ్లి ముందే ఫిక్స్ అయింది… ప్రెగ్నన్ట్ కావడం వల్లే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు,” అని చెప్పింది దియా.

39 ఏళ్ల దియా ఇటీవల ‘వైల్డ్ డాగ్’ సినిమాలో కనిపించింది. ఆ మూవీలో ఆమె నాగార్జునకి భార్యగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర కన్నుమూస్తే కనిపించకుండా పోయేంత లెంత్ ఉన్న రోల్. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఆర్టిస్టు చెయ్యాల్సిన పాత్ర.

More

Related Stories