నేను తాగుతాను… తప్పేంటి?

Paayal Ghosh

హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన పాయల్… ఈసారి వ్యక్తిగత స్వేచ్ఛ, స్త్రీ-పురుష సమానత్వంపై క్లాస్ తీసుకుంది.

ఇంతకీ ఇప్పుడీ టాపిక్ ఎందుకు ఎత్తుకుందో తెలుసా?

సెలబ్రిటీలు వీకెండ్ పార్టీస్ చేసుకోవడం సహజం. నిన్న పాయల్ కూడా అలాంటి పార్టీనే చేసుకుంది. మందు గ్లాసుతో సెల్ఫీ దిగి పోస్టు చేసింది. దీనిపై ఆమె మరోసారి ట్రోలింగ్ కు గురైంది. అయితే పాయల్ తగ్గలేదు. మందు కొడుతూ మరో సెల్ఫీ పోస్టు చేసి తనదైన స్టయిల్ లో వివరణ ఇచ్చింది.

తన జీవితాన్ని తనకు నచ్చినట్టు గడిపే ప్రాధమిక హక్కు తనకుందంటోంది పాయల్.

తను కూడా మందు కొట్టొచ్చని, సిగరెట్ తాగొచ్చని, కురుచ దుస్తులు కూడా ధరించొచ్చని చెప్పుకొచ్చింది. ఈ విషయాల్లో తనకు అడ్డుచెప్పే హక్కు ఎవ్వరికీ లేదంటోంది. స్త్రీ-పురుషులు సమానం అని చెప్పడమే తప్ప, ఎక్కడా అది జరగడం లేదని, సమానత్వం సాధించడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని అంటోంది పాయల్.

Related Stories