ఓవరాక్షన్ తగ్గించుకో పాయల్!

- Advertisement -
Payal Rajput

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది పాయల్ రాజ్ పుత్. కనీసం రోజుకు ఒక్కటైనా కొత్త ఫొటో పెడుతుంది. నెటిజన్స్ కూడా ఆమెను ఎప్పుడూ లైక్ చేస్తూనే ఉంటారు. ఆమె కామెంట్స్ కు మద్దతిస్తుంటారు. అయితే ఫస్ట్ టైమ్ పాయల్, నెటిజన్ల కామెంట్లు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓ చిన్నపాటి ట్రోలింగ్ ను ఆమె ఎదుర్కొంది.

Payal Rajput – Photos

కొత్త సినిమా సెట్స్ లో కరోనా టెస్ట్ చేయించుకుంది పాయల్. అది రొటీన్ గా జరిగిన వ్యవహారం. అందరికీ చేసినట్టే పాయల్ కు కూడా చేశారు. కానీ చిన్నపాటి శ్వాబ్ టెస్ట్ కే పాయల్ నానా రచ్చ చేసింది. గట్టిగా అరిచి నానా యాగీ చేసింది. 5 సెకెండ్లకే ప్రపంచం మునిగిపోయినట్టు కంగారుపెట్టేసింది.

పాయల్ చేసిన ఈ హంగామా నెటిజన్లకు నచ్చలేదు. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకో అంటూ సుతిమెత్తగానే తిట్ల దండకం అందుకున్నారు. ఈ టెస్ట్ లో పాయల్ కు నెగెటివ్ వచ్చింది. ఆ సంగతి పక్కనపెట్టి, ఆమె చేసిన హంగామాను అంతా తిట్టడం స్టార్ట్ చేశారు.

More

Related Stories