ఆమెని తీసుకోవడం డౌటే

- Advertisement -
Paayal Rajput

అజయ్ భూపతి డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం… “RX100”. ఆ సినిమాతోనే పరిచయమైంది పాయల్ రాజపుత్. ఆమెకి మరోసారి ఈ దర్శకుడు ఛాన్స్ ఇస్తున్నాడా? అవును అని ప్రచారం జరుగుతోంది. అజయ్ భూపతి తన రెండో సినిమాగా “మహా సముద్రం” అనే సినిమాని తీసున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలు. అదితి రావు, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లు.

షూటింగ్ జరుగుతోంది. మరి ఇందులో పాయల్ రాజపుత్ కి ఛాన్స్ ఎక్కడ? ఆమెకి ఒక కీలక పాత్ర అని అంటున్నారు.

ఐతే, అజయ్ భూపతి టీం మాత్రం అది అబద్దం అని అంటోంది. పాయల్ రాజపుత్ కి ఈ సినిమాలో పాత్ర లేదంట. దర్శకుడు అజయ్ కి రెండో సినిమా తీయడానికి మూడేళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో పాయల్ ఆరేడు సినిమాలు చేసింది.

కానీ పాయల్ కి ఇప్పుడు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఆమె అవకాశాల కోసం ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

 

More

Related Stories