
పాయల్ రాజపుత్ కి ఎట్టకేలకు ఒక సినిమా ఆఫర్ దక్కింది. రెండేళ్లుగా ఆమెకి ఒక్క అవకాశం వచ్చింది లేదు తెలుగులో. 2020లో రవితేజ సరసన ‘డిస్కోరాజా’, వెంకటేష్ తో ‘వెంకీమామ’ వంటి పెద్ద సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆమెకి ఎటువంటి పురోగతి చూపించలేదు.
రీసెంట్ గా ‘కిరాతక’ అనే సినిమా సైన్ చేసింది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ కి జోడి. లేటెస్ట్ గా మంచు క్యాంపులో చేరింది.
అవును, మంచు విష్ణు హీరోగా ఒక కొత్త సినిమా మొదలైంది. గాలి నాగేశ్వరరావు అనే పాత్ర పోషించనున్నాడు విష్ణు. తిరుపతిలోనే మొత్తం షూటింగ్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు తిరుపతి పయనం అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణుకి ఆమె లవర్ గా కనిపించనుందట.
విష్ణు తన సినిమాల్లో ‘లోకల్’ హీరోయిన్లకు ప్రాధాన్యం ఇస్తాను అని ‘మా’ ఎన్నికల టైములో చెప్పారు. కానీ, ఉత్తరాది సుందరి పాయల్ రాజపుత్ ని తన హీరోయిన్ గా తీసుకున్నాడు.