గ్రాఫ్ తగ్గిందంటే ఒప్పుకోదంట

కెరీర్ పడిపోయినప్పుడు హీరోయిన్లు దాన్ని కవర్ చేసే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే తమ కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని ఒప్పుకుంటారు తప్ప, మిగతా వాళ్లంతా కవర్ చేసే ప్రయత్నమే చేస్తారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా అదే పని చేసింది.

తన కెరీర్ గ్రాఫ్ పడిపోయిందంటే పాయల్ ఒప్పుకోవట్లేదు. ”ఆర్ఎక్స్100” నుంచి ఇప్పటివరకు ఎన్నో మంచి పాత్రలు చేసి, నటిగా ఎదిగిందంట పాయల్. ఓ నటిగా మనం ఎదుగుతున్నప్పుడు కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని ఎలా అంటారంటూ కవర్ చేస్తోంది.

నిజానికి పాయల్ కు ”ఆర్ఎక్స్100” తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. కెరీర్ లో ఆమె తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఆమెకు సక్సెస్ లేకుండా చేశాయి. అయితే తను మాత్రం అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడ్డానని, హిట్ అనేది మన చేతిలో లేదని నుదుటిపై రాసి ఉండాలని చెబుతోంది.

ప్రస్తుతం హిట్-ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన వర్క్ ను ఎంజాయ్ చేస్తున్నానంటున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ”అనగనగా ఓ అతిథి”, ”నరేంద్ర” సినిమాలతో మనముందుకు రాబోతోంది.

Related Stories