నాపై ట్రోలింగ్ ఆపండి ప్లీజ్!

కరోనా ప్రాధమిక పరీక్షలో భాగంగా చేసిన శ్వాబ్ టెస్ట్ పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె రచ్చ చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పాయల్ ను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ పై కూడా పాయల్ రియాక్ట్ అయింది.

“సూదులంటే నాకు భయం. సూదులే కాదు.. మెడిసిన్స్, ఇంజెక్షన్ ఏవైనా నాకు చాలా భయం. అందుకే కరోనా పరీక్షలో భాగంగా శ్వాబ్ టెస్ట్ అనేసరికి భయపడ్డాను. ఆమాత్రం దానికే నాపై ట్రోల్ చేయడం అన్-ఫెయిర్.”

ఇలా తను నిజంగానే భయపడ్డానని, ట్రోల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది పాయల్. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈ పరీక్షల కోసం ముగ్గురు వైద్యుల బృందం వచ్చిందని.. చాలా భయమేసి లాస్ట్ లో తను టెస్ట్ చేయించుకున్నానని తెలిపింది పాయల్.

మరోవైపు కరోనా రిస్క్ ను తగ్గించుకునేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయకూడదని పాయల్ డిసైడ్ అయింది. టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తుండడంతో హైదరాబాద్ లోనే ఉండేందుకు ఓ మంచి ఇల్లు కోసం వెదుకుతోంది.

Related Stories