అడుగు దూరంలో బంపరాఫర్!

Paayal Rajput

పాయల్ మరో క్రేజీ ఆఫర్ అందుకోబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే “పుష్ప” ప్రాజెక్టులోకి ఆమె ఎంటరయ్యే అవకాశాలున్నాయి. అవును.. పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ కోసం పాయల్ ను అనుకుంటున్నారు. ఆమె దాదాపు ఫిక్స్ అయినట్టే.

నిజానికి ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను ట్రై చేశారు. కుదరకపోతే టాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ తో చేయాలనేది ప్లాన్. కానీ ఎందుకో ఇప్పుడు పాయల్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యమే.

“ఆర్ఎక్స్100″తో గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అయితే ఆ తర్వాత పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. మధ్యలో ఓ ఐటెంసాంగ్ చేసినా అది ఓ మోస్తరుగానే క్లిక్ అయింది. “పుష్ప”లో ఐటెంసాంగ్ చేస్తే మాత్రం క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయి

ఎందుకంటే, సుక్కూ-దేవిశ్రీ కాంబోలో వచ్చిన ఐటెంసాంగ్స్ అన్నీ హిట్. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరికీ బన్నీ తోడైతే ఆ స్పెషల్ సాంగ్ సూపర్ హిట్. అలా వీళ్ల ముగ్గురి కాంబోలో వస్తున్న సినిమాలో ఐటెంసాంగ్ అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాయల్ కు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

Related Stories