నిన్నటికి నిన్న ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఎలా తయారైందో చూశాం. ఒళ్లంతా కప్పుకొని, పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ముంబయి నుంచి ఢిల్లీకి ప్రయాణం చేసింది. ఇప్పుడు అదే దారిలో పాయల్ రాజ్ పుత్ కూడా విమానమెక్కింది. అయితే రకుల్ తో పోలిస్తే పాయల్ స్టయిలిష్ గా తయారైంది.
ఒంటిపై పీపీఈ కిట్ లాంటిది ధరించింది. కాకపోతే అది పీపీఈ కిట్ కాదు. స్టయిలిష్ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ అది. టాప్ టు బాటమ్ మొత్తం కవర్ చేసింది. ముఖానికి మాస్క్ వేసుకుంది. ఇవన్నీ పక్కనపెడితే.. అలాంటి డ్రెస్ లో కూడా ఫొటోలకు హాట్ హాట్ పోజులివ్వడంలో ఏమాత్రం తగ్గలేదు పాయల్.
ఓ పక్క లగేజ్, ఓ చేతిలో హ్యాండ్ బ్యాగ్, మరో చేతిలో శానిటైజర్ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది. ఈ స్టిల్స్ చూసిన జనాలంతా దానికి ముద్దుగా “కరోనా ఫొటోషూట్” అని పేరుపెట్టారు.