టికెట్ రేట్లు ‘పక్కా కమర్షియల్’ కాదు

సినిమాకు పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టారు కానీ టికెట్ రేట్ల విషయంలో మాత్రం అంత కమర్షియల్ గా వ్యవహరించడం లేదు సినిమా యూనిట్. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, ముందు నుంచే ప్రేక్షకుల్ని మెంటల్లీ ప్రిపేర్ చేస్తున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్.

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా కోసం సవరించిన టికెట్ ధరల పట్టికను ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు విడివిడిగా టికెట్ రేట్లు ప్రకటించారు. నైజాంలో 160+జీఎస్టీ, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ లో 100+జీఎస్టీ అని చెప్పుకొచ్చారు. అయితే నైజాం మల్టీప్లెక్సుల్లో ఇంకా రేటు ఫిక్స్ చేయలేదు.

ప్రస్తుతం థియేటర్లలో తక్కువ టికెట్ రేట్లతో నడుస్తున్న సినిమాగా మేజర్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా కంటే తక్కువ రేట్లను పక్కా కమర్షియల్ కోసం ఫిక్స్ చేశారు మేకర్స్. 

 

More

Related Stories