ఇదెక్కడి లాజిక్ పరశురామ్..!

సమయం, సందర్భం లేకుండా ప్రెస్ మీట్ పెట్టాడు దర్శకుడు పరశురామ్. అప్పటికే సర్కారువారి పాట సినిమాపై చాలా విమర్శలున్నాయి. వాటిని దాటి సినిమా సక్సెస్ అయిందని యూనిట్ చెప్పుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మీడియా సమావేశాన్ని ఎవాయిడ్ చేస్తే బాగుండేది. కానీ పరశురామ్ మాత్రం ఏరికోరి ప్రెస్ మీట్ పెట్టాడు. లాజిక్ లేకుండా మాట్లాడి మరోసారి దొరికిపోయాడు.

సర్కారువారి పాట సినిమాలో కీర్తిసురేష్ కు 2 దఫాలుగా డబ్బులిస్తాడు మహేష్. ఒకసారి 10వేల డాలర్లు, మరోసారి 15వేల డాలర్లు ఇస్తాడు. కానీ సినిమా ఆసాంతం తన 10వేల డాలర్లు వెనక్కు ఇవ్వమని మాత్రమే అడుగుతుంటాడు. దీనిపై మీడియా ప్రశ్నిస్తే, దాన్ని తనదైన శైలిలో సమర్థించుకున్నాడు పరశురామ్. మొదటి 10వేల డాలర్లు అప్పుగా ఇచ్చాడట. కాబట్టి అది మాత్రమే తిరిగి ఇవ్వాలని అడుగుతాడంట. మిగతా 15 వేల డాలర్లను ప్రేమతో ఇచ్చాడట. కాబట్టి అడగడట.

ఇక హీరోయిన్ పై కాళ్లు వేసుకొని పడుకునే ఎపిసోడ్ పై కూడా తనదైన స్టయిల్ లో లాజికల్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు పరశురామ్. హీరోయిన్ ను హీరో అమ్మలా చూసుకుంటాడంటూ ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. పరశురామ్ చెప్పిన లాజిక్స్, ఇచ్చిన సమాధానాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

 

More

Related Stories